Venkatesh: జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ స్థాయిలో మెజారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గెలవడంతో ఈయన ఏపీ కేబినెట్లో కీలక పదవులు కూడా అధిరోహించబోతున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలును ఎదుర్కొని ఈ స్థాయిలో విజయం సాధించడంతో ఈయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ విజయం పై స్పందించి శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ సైతం పవన్ కళ్యాణ్ విజయంపై స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ట్విట్టర్ వేదికగా వెంకటేష్ స్పందిస్తూ..కంగ్రాట్స్ డియర్ పవన్ కళ్యాణ్ ఇంతటి భారీ విజయం సాధించినందుకు. దీనికి నీకంటే అర్హులు ఎవరు లేరు. నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావం కొనసాగించాలి, అలాగే నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పోస్ట్ చేసాడు.
నువ్వే అర్హుడివి..
ఇలా పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు విజయానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ని పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ సంబోధిస్తూ వెంకటేష్ పోస్ట్ చేయడంతో వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి గోపాల గోపాల సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.





























