Vennela Kishore: ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. . దీంతో ప్రజలు వారి వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునే పనిలో పడ్డారు.రూ.2 వేల నోట్ల రద్దు పై భారత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతు న్నాయి. ఇవి నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి సినీ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కి నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు కుప్పలుగా ఉన్న 2 వేల రూపాయల నోట్ల ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ..” వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ కింది ఫొటో తీసుకొన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వెన్నెల కిషోర్ ఈ నోట్లను ఏం చేస్తాడో అనే అనుమానం కలుగుతుంది’ అని రాసుకొచ్చాడు.
మంచు విష్ణు చేసిన ఫోటోపై… నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇన్ కం ట్యాక్స్ వాళ్లను పిలవాల్సిందే’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మా ఎలక్షన్స్ కి ఫండ్ ఇస్తాడు అని మరికొందరు, ఇలా వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు విష్ణు ట్వీట్‌పై వెన్నెల కిషోర్ కూడా స్పందించాడు. ‘ నా మీద పడతారేంటి ‘ అని రిప్లై ఇచ్చాడు.

Vennela Kishore: నా మీద పడతారేంటి….
మంచు కుటుంబ సభ్యుల తో వెన్నెల కిషోర్ కి మంచి అనుబంధం ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ తో వెన్నెల కిశోర్ చాలా చనువుగా ఉంటాడు. ఈ క్రమంలో వెన్నెల కిషోర్‌ను ఆట పట్టించడానికే మంచు విష్ణు ఇలా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA
— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023