Venuswamy: వేణు స్వామి తరచూ ప్రభాస్ కి సంబంధించిన జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ప్రభాస్ జాతకం గురించి కామెంట్లు చేయగా ప్రభాస్ అభిమానులు మాత్రం వేణు స్వామి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇలా తరచూ ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి మాట్లాడటంతో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అసలు ఆయన వద్దకు ప్రభాస్ జాతకం వెళ్లే అవకాశాలే లేవని అసలు వేణు స్వామి అంటే ఎవరో కూడా తెలియదు అన్న విధంగా ఈమె మాట్లాడారు ఈ వ్యాఖ్యలపై ఇటీవల వేణు స్వామి స్పందించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ పెద్దమ్మకు ఆయనకు సంబంధం లేదని ప్రభాస్ కు చాలామంది బంధువులు ఉన్నారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. నేను ప్రభాస్ తల్లి గారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఇకపోతే ప్రభాస్ జాతకం నా వద్దకు ఎలా వచ్చిందనే విషయాలను నేను చెప్పాలని అనుకోవడం లేదంటూ వేణు స్వామి తెలిపారు. ఇకపోతే శ్యామల దేవి గారు నేను అంటే తెలియదా అన్నట్టు మాట్లాడుతున్నారు ఆమె ఎలా మాట్లాడటం సరికాదని తెలిపారు.
కృష్ణంరాజు గారి కోసం…
ఎందుకంటే కృష్ణంరాజు గారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన రాజకీయాలలో కొనసాగుతున్నారు అయితే తన భర్త గవర్నర్ అవుతారా లేదా అనే విషయాలను తెలుసుకోవడం కోసం శ్యామలాదేవి గారు స్వయంగా నా వద్దకు వచ్చారని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. ఇలా నా వద్దకు వచ్చిన ఆమె ఇప్పుడు నేను ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడటం సరైనది కాదంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



























