Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వేణు స్వామి ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇకపై తాను సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెప్పను అంటూ ఈయన వెల్లడించారు.

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు అయితే ఈయన చెప్పిన జాతకాలు ఇటీవల కాలంలో నిజం కాలేదు తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి రాదని తిరిగి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బల్లగుద్ది మరి వేణు స్వామి జాతకం చెప్పారు అయితే ఈయన జాతకం నూటికి నూరు శాతం తప్పు అయింది.
ఈ విషయంపై వేణు స్వామిని భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు స్వామి స్పందిస్తూ 2024 ఏపీ ఎన్నికల ఫలితాలలో తాను చెప్పిన జాతకం తప్పు అయింది. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను మోడీ హవ తగ్గుతుందని చెప్పాను. అది నిజమైంది కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పినప్పటికీ అది నిజం కాలేదు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఎవరి జాతకం చెప్పను..
ఇకపై సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి జాతకాలను అలాగే రాజకీయ నాయకుల జాతకాల గురించి ఎక్కడ మాట్లాడానని ఈయన ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే వేణు స్వామి జాతకాల పట్ల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోల్స్ నుంచి బయటపడటం కోసమే ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.



























