Nagarjuna: గత వారం రోజులుగా నటుడు నాగచైతన్య శోభితకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడంతో వేణు స్వామి వీరి జాతకం గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ విడిపోతారని ఈయన చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారని స్వయంగా వేణు స్వామి తెలిపారు.

అదేవిధంగా తెలుగు ఫిలిం జర్నలిస్టులు సైతం మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో వారి నుంచి వేణు స్వామికి నోటీసులు అందాయని ఈ నెల 22వ తేదీ వ్యక్తిగత విచారణకు కూడా హాజరు కావలసి ఉందని తెలుస్తుంది. ఇలా వేణు స్వామి నాగచైతన్య శోభిత గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈయన అరెస్టయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
ఈ విధంగా వేణు స్వామి సంచలన వ్యాఖ్యల ద్వారా నాగార్జున కూడా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సమాచారం. వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈయన కూడా ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ ఘనంగా పార్టీ ఇవ్వడమే కాకుండా తనని సపోర్ట్ చేయాలి అంటూ వారికి పెద్ద ఎత్తున డబ్బు కూడా ఇచ్చారని తెలుస్తోంది.
చైతన్య శోభిత నాకు గిఫ్ట్ ఇవ్వాలి..
అయితే తన కొడుకు, కాబోయే కోడలు గురించి వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున వేణు స్వామి బిగ్ బాస్ ఎంట్రీ పై వేటు వేసారని తెలుస్తోంది. అంతే కాకుండా వేణు స్వామికి మద్దతుగా తన భార్య వీణ వాణి సైతం సోషల్ మీడియా వేదికగా మా అధ్యక్షుడు మంచు విష్ణును ఉద్దేశించి అలాగే నాగచైతన్య శోభిత తనకు గిఫ్ట్ ఇవ్వాలి అంటూ సెటైరికల్ గా మాట్లాడటంతో పలువురు నేటిజన్స్ ఈమెపై కూడా భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.



























