Venu Swamy: సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.ఈయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి జాతకాలు చెప్పడంతో కొన్నిసార్లు ఈయన మాటలను ఏమాత్రం పట్టించుకోరు అయితే అవి జరిగినప్పుడు వేణు స్వామి చెప్పినది నిజమే అంటూ చాలామంది ఈయన మాటలను నమ్ముతున్నారు. ఈయన చెప్పిన మాటలు సమంత నాగచైతన్య విషయంలో నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమైంది.

ఈ క్రమంలోనే గత రెండు నెలల క్రితం వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక హీరోయిన్ హీరో త్వరలోనే చనిపోబోతున్నారని వారి వయసు 40 సంవత్సరాలకు లోపే ఉంటుంది అంటూ ఈయన చెప్పారు. అయితే ఈయన మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నందమూరి తారకరత్న మరణించడంతో గతంలో వేణు స్వామి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వేణు స్వామి చెప్పిన విధంగానే టాలీవుడ్ హీరో మరణించారు. మరి ఆ హీరోయిన్ ఎవరా అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

Venu Swamy: మరి ఆ హీరోయిన్ ఎవరు…
ఇక వేణు స్వామి ఈ సెలబ్రిటీల జీవితాలను చెబుతూ వాళ్ళు ఆత్మహత్య కారణంగా లేదా సహజ మరణంతో చనిపోబోతారని ఈయన తెలియచేశారు. మేష రాశికి చెందిన హీరోయిన్, వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన హీరో చనిపోతాడని వేణు స్వామి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.































