Venu Thottempudi : నా పొలిటికల్ ఎంట్రీ… జగపతి బాబుతో గొడవలు… అప్పటి నుండి మాటలు లేవు…: హీరో వేణు తొట్టెంపూడి

0
234

Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో వేణు తొట్టెంపూడి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని ఆ తరువాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. అయితే ‘దమ్ము’ సినిమా తరువాత సినిమాలకు దూరమైన వేణు చెన్నై లో స్థిరపడి తన వ్యాపారాల్లో బిజీ అయ్యారు. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తరువాత రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో నటించారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న వేణు ఆయన సినిమా కెరీర్ గురించి విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జగపతి బాబుతో మాటలు లేవు … నేను రాజకీయాల్లోకి…

సినిమాల్లో జగపతి బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్న వేణు కి ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయి. అలా ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చినపుడు జగపతి బాబు గారు హామీ ఇచ్చి ఇప్పించారు. అయితే ఆ వ్యక్తి డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు. మొత్తం 14 లక్షలు పోయాయి. ఆ సమయంలో నాకది చాలా ఎక్కువ డబ్బు. కానీ జగపతి బాబు గారు కనీసం ఫోన్ చేసి ఆ తరువాత ఒకసారి కూడా ఇచ్చాడా లేదా అని అడగలేదు. ఆ ఇష్యూని నేను ఇక వదిలేసాను, అతను ఇవ్వడని అర్థమైంది. ఆ తరువాత జగపతి బాబు గారు నాతో మళ్ళీ మాట్లాడలేదు కొంచెం బాధేసింది అంటూ చెప్పారు.

ఇక తన అమ్మ తరుపు బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. తాత అంకినేడు రాజకీయాల్లో పలుకుబడి ఉండగా కావూరి సాంబశివరావు గారు బంధువే. అలాగే మా సొంత బావ నామా నాగేశ్వరరావు గారు ఆయన ఖమ్మం ఎంపీ గా పనిచేసారు. ఆయన ఎన్నికల ప్రచారాలకు వెళ్ళేవాడిని. అది కుటుంబంలో ఒక్కడిగా నా బాధ్యత అంతే కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి నాకులేదు, ఇపుడు ఎలా నడుస్తోందో జీవితం అది చాలా ఆనందంగా ఉంది నాకు అంటూ వేణు చెప్పారు.