RGV: విశ్వక్ సేన్,రుక్సార్ దిల్లాన్ హీరోహీరోయిన్లుగా, విద్యాసాగర్ చింత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో విశ్వక్సేన్ ఒక ఫ్రాంక్ వీడియో చేసిన విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై ఏకంగా ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ కూడా నిర్వహించారు. ఈ డిబేట్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్, ప్రముఖ యాంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇలా వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఏకంగా టీవీ యాంకర్ హీరో విశ్వక్ సేన్ ను స్టూడియో నుంచి బయటకు వెళ్లాలి అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ క్రమంలోనే ఈ వీడియోపై కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు.
సర్కార్ కన్నా తక్కువేం కాదు…
ట్విట్టర్ ద్వారా వర్మ స్పందిస్తూ… ఒక పురుషుడు కన్నా ఒక మహిళ పవర్ ఫుల్ గా కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదని వర్మ ట్వీట్ చేస్తూ..ఈ ట్వీట్ ను సదరు టీవీ యాంకర్ కి ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విశ్వక్సేన్ ఈ విధమైనటువంటి ఫ్రాంక్ వీడియో చేయడంతో ఈయనపై అడ్వకేట్ అరుణ్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. మరి విశ్వక్సేన్ ఈ ఫ్రాంక్ వీడియో ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.
I never saw a woman looking so much more powerful than a man ???????????? @Devi_Nagavalli is no less than SARKAR ???????????? pic.twitter.com/QbJIMTbR0K
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
































