Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వం.. టాలీవుడ్ కు మధ్య టికెట్ రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. థియేటర్ల టికెట్ రేట్లను ప్రభుత్వం తగ్గిండచంతో ఇండస్ట్రీ పెద్దలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ కు తీవ్ర నష్టం కలిగిస్తుందన వారంతా అంటున్నారు.

మరోవైపు పేదలు సినిమా చూసే విధంగా టికెట్ రేట్లను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నాని, సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హీరో నాని థియేటర్ల కలెక్షన్ల కన్నా.. కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తీవ్ర వివాదాన్ని రాజేశాయి.

ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని కూడా అంతే స్థాయిలో ఫైర్ అయ్యారు. మరికొంత మంది మంత్రులు సినిమా హీరోలు వాళ్ల రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే టికెట్ ధరలు అదుపులోనే ఉంటాయని అన్నారు.
ఇదిలా ఉంటే సెన్సెషనల్ డైరెక్టర్ వర్మ కూడా.. ఈ వివాదంపై స్పందించారు.
ప్రభుత్వంపై నేరుగా విమర్శలు..
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వర్మ జగన్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. థియేటర్ల టికెట్ రేట్లు, తెలుగు ఇండస్ట్రీపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా.. ఇండస్ట్రీ పెద్దలు స్పందించకపోవడంలో వింతేమీ లేదని వర్శ అన్నారు. ఇండస్ట్రీ పెద్దలు అంటే వెల్ సెటిల్డ్ అని.. వారు మాట్లాడిన అవసరం కూడా లేదని.. వారు కావాలని ప్రభుత్వంతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు అని వర్మ అన్నారు. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ప్రభుత్వం చేస్తున్నవి స్టుపిడ్ ఆర్గుమెంట్స్ అని.. నిర్మాత ఎంత డబ్బు పెట్టి సినిమా తీశాడని ఎవ్వరూ… చూడరని.. ఏ హీరో సినిమా అని మాత్రమే చూస్తారని.. సినిమాకు హీరో బ్రాండ్ అంటూ వర్మ అన్నారు.





























