మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే రేంజ్ లో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు చిరు. ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలలో నటిస్తున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.

అనంతరం దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా వస్తోంది. ఇక సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ నయా లుక్ లో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ లుక్ మూవీకి సంబంధించి కాదు.అసలేం జరిగిందంటే..అక్టోబర్ 31న హలో వీన్ డే సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు ఫోన్ మోడ్ లో గోస్ట్ గెటప్స్ లో ఈ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.
Boss @KChiruTweets Insta story ❤️❤️???????? pic.twitter.com/7HYJmUyoJN
— chiranjeevi tharvathe yevarayina | Aacharya ???????? (@Deepu0124) October 31, 2021
ఇందులో భాగంగానే చిరంజీవి కూడా దెయ్యం లుక్ లో ఉన్న సరదా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వీడియోని ఇంస్టా స్టోరీస్ లో పోస్ట్ చేసి తన ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచారు. హ్యాపీ హలోవిన్ అంటూ విషెస్ తెలిపారు. ఉత్కంఠభరితమైన రోజు అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

































