తినుకుంటూ కూర్చుంటే కొడలైనా కరిగిపోతాయి.. కానీ మన కండలు మాత్రం కరగవు అని పెద్దలు చెబుతుంటారు. ఏ మాత్రం కష్టం లేకుండా తింటూ ఉంటే మాత్రం పని చేయడానికి శరీరం కూడా సహకరించదు. అయితే పెంపుడు కుక్కలను పెంచుకోవడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. వాటిని కూడా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తూ అన్యోనంగా మెలుగుతారు.

అయితే ఆ ప్రేమ ఓ పెంపుడు కుక్కకు బద్దకంగా తయారు చేసింది. పెంపుడు కుక్క చాలా లేజీగా తన మూడ్‌ను ప్రదర్శించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. కుక్కను పెంచుకుంటున్న ఓ యజమాని దానిని పార్క్ లో ట్రైనింగ్ ఇస్తున్నాడు.
కొంచెం దూరం వరకు దానిని తిప్పిన తర్వాత ఓ చోట చిన్న జంప్ చేయమాని ఆదేశించాడు. కానీ ఆ కుక్క దానిని పూర్తి చేయలేకపోయింది. అక్కడ జంపింగ్ స్టిక్ ను వాడినా కూడా ఒక కాలు తీసి మరో కాలు వేయడానికి కూడా బద్దకంగా ప్రవర్తించింది. బహుశా వీకెండ్ తరువాత ఇంతటి ఎక్సర్‌సైజ్ ఏంటి అనుకుందో ఏమో గానీ.. తన లేజీనెస్‌ని బ్రహ్మండంగా ప్రదర్శించింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కుక్క బద్దకం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. కుక్క ప్రవర్తించే బద్దకం బాగుందని ఒకరు కామెంట్ చేస్తే.. ఇటువంటి శనకం కోసమే వెతుకుతున్నానని మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































