తమిళ హీరో దళపతి విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే.. తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది ‘మాస్టర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్.. త్వరలో ‘బీస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది. అయితే తాజాగా విజయ్ ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ల తల్లిదండ్రులతో సహా.. 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టారు. కొన్ని రోజుల కిందట హీరో విజయ్ తండ్రి సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎస్.ఎ.చంద్రశేఖర్, ట్రెజరర్‌గా శోభా చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. విజయ్ కూడా రాజకీయాల్లో పొల్గొంటున్నారంటూ అతడి తండ్రి ప్రకటన చేయగా.. తనకు.. ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ విజయ్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.
ఇలా తన పేరును వినియోగించున్న వారిపై కేసు పెట్టారు. తర్వాత తన తండ్రి చంద్రశేఖర్ ఈ విషయంలో వెనక్కి తగ్గారు. తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ఆయన చెన్నై హక్కుల కోర్టులో సమాధాన పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మరో వార్త సంచలనంగా మరింది. హీరోకు, తండ్రికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని.. ఓ తమిళ వార్తా పత్రిక ప్రచురించింది.
హీరో తండ్రి, తల్లి .. విజయ్ ఇంటి బయట కారులో ఉండగా.. కేవలం తన తల్లిని మాత్రమే ఇంట్లోకి పిలిచి.. మాట్లాడి పంపించాడని.. విజయ్ తండ్రిని మాత్రం ఇంట్లోకి రమ్మనలేదనేది ఆ వార్త సారాంశం. దీనిపై చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తాను ఇచ్చిన ఇంటర్వ్యూను వక్రీకరించారని.. తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని..అందరం కలిసి మాట్లాడుకుంటున్నామని స్పష్టం చేశాడు.































