Vijay Antony: సినిమా షూటింగ్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇలా ప్రమాదాలు జరిగిన సమయంలో సెలబ్రిటీలు కొందరు బయటపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.తాజాగా బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని సైతం షూటింగ్లో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.

విజయ్ ఆంటోని తన తదుపరి సినిమా షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈయన ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్లో భాగంగా విజయ్ వాటర్ బోట్ లో ప్రయాణం చేస్తూ ఉండగా ఉన్నఫలంగా ఆ పడవ కెమెరా ఉన్న మరొక బోట్ వైపు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హీరో విజయ్ గాయాలయ్యాయి.

Vijay Antony: సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందిన విజయ్…
ఇలా ప్రమాదం జరగడంతో వెంటనే అలర్టు అయిన చిత్ర బృందం అంబులెన్స్ కు ఫోన్ చేసి తనని ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయ్ చికిత్స పొందుతున్నాడు.మరి ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన హీరోగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో విడుదలైనప్పటికీ బిచ్చగాడు సినిమా మాత్రమే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది

































