Vijay Devarakonda-Allu Arjun: గతంలో ఏ స్టార్ హీరో అయినా తన ఫ్యాన్స్ బలాన్ని, క్రేజ్ చూపించాలంటే… అభిమాన సంఘాలను చూపించే వారు. ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. స్టార్ల క్రేజ్ తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య డిసైడ్ చేసే పరిస్థితి ఏర్పడింది.

గతంలో తెలుగు, తమిళ్ , హిందీ సినిమాలు అనే బౌండరీలు ఉండేవి. ప్రస్తుతం వరసగా సౌత్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తుండటంతో పాటు.. బాలీవుడ్ సినిమాలు వరసగా సౌత్ భాషల్లో డబ్ అవుతుండటంతో అంతా ఇండియన్ స్టార్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరగుతోంది.

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నాడు. సారా అలిఖాన్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ భామలు సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ ఫాలోవర్ల సంఖ్య 1 కోటి 40 లక్షలను దాటింది.
ఇన్ స్టాలో బన్నీ తర్వాత.. విజయ్ దేవర కొండ..
ఐకాన్ స్టార్ బన్నీ తర్వాతి స్టానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నారు. బన్నీకి ఇన్స్టాలో 1 కోటి 44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే త్వరలోనే బన్నీని విజయ్ దేవరకొండ మించిపోతాడని అంటున్నారు. అయితే ఎంత కాలంలో బన్నీని క్రాస్ చేస్తాడో చూడాలి. స్టార్ హీరోలు తమ ఫాలోవర్లను పెంచుకోవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంటే.. కేవలం 4 ఏళ్లలోనే విజయ్ దేవరకొండ ఎవరికి అందనంత ఎత్తులో ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా లైగర్ రాబోతోంది. దీని తరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ.

































