Vijay Devarakonda: ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు గారి మరణ వార్త నుంచి ఇంకా బయటపడక ముందే మహేష్ బాబు తల్లి ఇందిరా గారు మృతి చెందడం ఇండస్ట్రీనీ ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది. బుధవారం ఉదయం మహేష్ తల్లి మరణించడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు మహేష్ బాబు నివాసానికి చేరుకున్నారు.

ఇకపోతే నటుడు విజయ్ దేవరకొండ సైతం కృష్ణ ఇంటికి చేరుకొని ఇంద్ర గారికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అక్కడే సోఫాలో కూర్చున్నటువంటి కృష్ణ గారి కాళ్ళ వద్దా కూర్చోని తనకు ధైర్యం చెబుతూ తనని ఓదార్చారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా విజయ్ దేవరకొండ కృష్ణ కాళ్ల దగ్గర కూర్చుని ఆయనకు ఓదార్చడంతో నేటిజెన్లు విజయ్ దేవరకొండ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఒకప్పుడు యాటిట్యూడ్ అంటూ విజయ్ దేవరకొండను నెటిజన్ల భారీగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు ఇప్పుడేమంటారు అంటూ పెద్ద ఎత్తున విజయ్ తీరుపై ప్రశంసలు కురిపిస్తూ తనని విమర్శించిన వారిని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Vijay Devarakonda: విజయ్ మనసు ఎంతో మంచిది..
ఈ విధంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా యాటిట్యూడ్ కనబరిచారు అంటూ పెద్ద ఎత్తున తనపై విమర్శలు చేశారు. అయితే ఆయన మనసు ఎంతో మంచిదని విజయ్ దేవరకొండ చాలా నిదానస్తుడుఅంటూ ఆయన అభిమానులు చెప్పుకొచ్చిన కొంతమంది మాత్రం పెద్ద ఎత్తున తనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండను విమర్శించిన వారికి ఇదే సమాధానం అంటూ విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

































