Vijay Devarakonda: అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కెరియర్ ను ఓ మలుపు తిప్పిన సినిమా అని చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన ఒక సీన్ ప్రస్తుతం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమా విడుదలై ఐదేళ్ల అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని ఇందులో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ జనాలకు పిచ్చెక్కిస్తున్నాయని ఈ వీడియో ద్వారా మరోసారి నిరూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. 2.53నిడివి ఉన్నటువంటి ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ప్రీతిని టెర్రస్ పై ముద్దు పెట్టుకుంటూ ఉండగా తన తండ్రి వచ్చి తనని తిట్టి తీసుకెళ్తారు ఆ సన్నివేశం తర్వాత వచ్చే సీన్ డిలీట్ చేశారు అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. అమ్మ నాన్నమ్మ ఒక పది రోజుల గ్యాప్ తర్వాత నన్ను కలిస్తే వాళ్ళు ప్రేమతో నన్ను హగ్ చేసుకుని ముద్దు పెడతారు. ఆరోజు టెర్రస్ పై ప్రీతికి నేను పెట్టిన ముద్దు కూడా అలాంటిదే అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ తో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది.

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదా…
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంత మంచి సీన్ ఎందుకు కట్ చేశారు అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గత ఐదు సంవత్సరాలు క్రితం ఆగస్టు 25వ తేదీ విడుదల అయ్యి సూపర్ హిట్ కావడంతో ఇదే రోజును సెంటిమెంట్ గా భావించి విజయ్ దేవరకొండ తన లైగర్ సినిమాని విడుదల చేశారు. అయితే ఈ సినిమా మాత్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పాలి.ఇక ఈ సినిమాని చూసిన విజయ్ దేవరకొండ అభిమానుల సైతం జీర్ణించుకోలేకపోతున్నారు ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మార్క్ ఎక్కడ కనిపించలేదని, అసలు పూరి తీసిన సినిమా నేనా ఇది అనేలా ఉందంటూ అభిమానులు ఈ సినిమా పై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.































