Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈయనకున్న క్రేజ్ చూసి ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.విజయ్ దేవరకొండ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కోసం ఏకంగా 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

Vijay Devarakonda: భారీ అంచనాలను పెంచిన ట్రైలర్…
ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమా అవకాశాలను అందుకొని భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తన మార్కెట్ మరింత పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఇటు సౌత్ అభిమానులు మాత్రమే కాకుండా నార్త్ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

































