Vijay Devarakonda: ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన హీరోగా కొనసాగుతున్న ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కరోనా కారణంగా లాక్ డౌన్ పడటంతో ఎంతోమంది జీవనోపాధిని కోల్పోయి కనీస తిండి కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు అలాంటి వారిని ఆదుకోవడం కోసం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈయన విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఏకంగా 6000 కుటుంబాలకు సహాయం అందించారు.
అయితే తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ సీజన్ 3 కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సహాయం చేసిన కొంతమంది కుటుంబాలను ఇక్కడికి తీసుకువచ్చారు. వీరిలో ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ కరోనా సమయంలో మాకు జీవనోపాధి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
కనిపించే దేవుడు..
రోడ్లపై అడుక్కు తింటూ జీవనం గడిపే వాళ్ళం. అలాంటి సమయంలో మీరు ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిసి అప్లై చేసుకున్నాము వెంటనే మాకు సాయం అందిందని తెలిపారు. నాతోపాటు 18 మంది ట్రాన్స్ జెండర్లకు మీ ఫౌండేషన్ ద్వారా సహాయం అందింది. అప్పటినుంచి మిమ్మల్ని కలిసి ఒక్కసారైనా కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాము మీరు కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో విజయ్ దేవరకొండ కూడా ఈమె మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు.



























