Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పూరి చార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలయ్యి హిందీ వెర్షన్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మిగిలిన అన్ని భాషలలో కలిపి ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను చవిచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నష్టాలను భరించడం కోసం పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా లాభాలతో కలిపి ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాలలో వచ్చిన లాభాలను హీరోకి ఇవ్వలేదని అయితే ఆ లాభాలు తనకు వద్దని చెప్పడమే కాకుండా తనకి ఇచ్చిన ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.
ఈ విధంగా ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్ చార్మిలతో కలిసి చేయాల్సి ఉంది.

Vijay Devarakonda: జనగణమన లాభాలలో వాటా..
పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే అందులో వచ్చే లాభాలను విజయ్ దేవరకొండ తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఇలా సినిమా నష్టపోవడంతో నిర్మాతలకు విజయ్ దేవరకొండ అండగా నిలబడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రం ఖుషి, జనగణమన సినిమాలపై దృష్టి పెట్టారు.

































