Vijay devarakonda & Samantha : ఖుషి సినిమా కోసం అంత రెమ్యూనరేషన్ తీసుకున్న రౌడీ హీరో… రౌడీ కి అంత సీన్ ఉందా అంటూ నోర్లెళ్ళబేడుతున్న నెటిజన్స్….!

0
25

Vijay devarakonda & Samantha : సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి తాజాగా ఖుషి సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్ప్పటికే పాటలు, ట్రైలర్ అంటూ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇద్దరు ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా చూయించాడు దర్శకుడు శివ నిర్వాణ. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ వంటి సినిమాలను తీసిన శివ నిర్వాణ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీసాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య సాగే కథ ఈ ఖుషి సినిమా సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్ధం కాగా సినిమా ప్రొమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి.

విజయ్, సమంత, ఖుషి కోసం అంత తీసుకున్నారు….

విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఆల్రెడీ మహానటి సినిమాలో నటించారు. ఇక ఇపుడు ఈ సినిమాలో భార్యభర్తలుగా అలరించునున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆకట్టుకోగా ఈ సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండ ఏకంగా 23 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లుగా నెట్టింట్లో వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. విజయ్ 23 కోట్లు, సమంత 4.5 కోట్లు, ఇక డైరెక్టర్ శివ నిర్వాణ 12 కోట్లు తీసుకున్నారట.

అయితే చాలా మంది నెటిజన్స్ వీరి రెమ్యూనరేషన్ విని షాక్ అవుతున్నారు. వీళ్ళే ఇంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటే ఇక సినిమా బడ్జెట్ ఎంత ఉండాలి, రికవరీ ఎంత కావాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక లైగర్ తో విజయ్, శాకుంతలం సినిమాతో సమంత, టక్ జగదీశ్ సినిమాతో శివ ముగ్గురు ప్లాప్స్ చవిచూడగా వీరి ముగ్గురి కెరీర్ కి ఈ సక్సెస్ అవసరం.