Vijay Devarakonda: అనసూయతో వివాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ… ఏమన్నారో తెలుసా?

0
28

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి చిత్ర బృందం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ట్వీట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. ఇలా అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం విజయ్ ఫాన్స్ ఆమెను భారీగా ట్రోల్ చేయడంతో ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున వివాదంగా కూడా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు విజయ్ ను ప్రశ్నించారు.

Vijay Devarakonda: గొడవపడే వాళ్ళనే అడగండి….


అనసూయతో వివాదం ఎప్పుడు మొదలైంది అసలు ఈ వివాదానికి ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది అంటూ ఈయనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెబుతూ ఏమో మీరు గొడవ పడే వాళ్ళనే అడగాలి సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు అంటూ చాలా సింపుల్ గా సమాధానం చెబుతూనే ఈ ప్రశ్నకు మీరు అనసూయనే అడగండి అంటూ ఈయన సమాధానం చెప్పేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతుంది.