Beast Movie: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలను పెంచిన చిత్రబృందం విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. హిందీ, తెలుగు,తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే 200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ వసూళ్లు కూడా కేవలం విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగానే వచ్చాయని చెప్పవచ్చు. ఇలా వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులలో అసంతృప్తిని కలిగించింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా పై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ..అరబిక్ కుత్తు పాటను ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో..నేను కూడా ఆ పాటను అంతే ఎంజాయ్ చేశాను కానీ ఈ సినిమా కేవలం విజయ్ క్రెడిట్ కారణంగానే వసూళ్లు రాబట్టిందంటూ తెలిపారు.
దర్శకుడి పై విమర్శలు చేసిన చంద్రశేఖర్…
అంతర్జాతీయ ఉగ్రవాదులకు సంబంధించిన కథను ఎంపిక చేసుకునే సమయంలో స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా చూపించాలి. కానీ నెల్సన్ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో మరింత దృష్టి పెట్టాల్సి ఉండేదనీ ఈయన దర్శకుడు పై విమర్శలు చేశారు. ఈ సినిమా విజయంలో ఫైట్ మాస్టర్స్, సంగీతదర్శకుడు, ఎడిటర్స్ కీలక పాత్ర పోషించారని చెప్పిన చంద్రశేఖర్ డైరెక్టర్ నెల్సన్ గురించి ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ప్రస్తుతం చంద్రశేఖర్ బీస్ట్ సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

































