“అర్జున్ రెడ్డి” ఈ చిత్రం విజయ్ దేవరకొండ ఇమేజ్ ను అమాంతం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. స్టార్ డమ్ రావాలి అంటే చాలా కష్టం. కానీ విజయ్ దేవరకొండకి మాత్రం అది రాత్రికి రాత్రే “అర్జున్ రెడ్డి” సినిమా తెచ్చేసింది. ఈ సినిమాతో యూత్ లో భయంకరమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్. అంతేకాదు అర్జున్ రెడ్డి తరువాత వచ్చిన “గీతా గోవిందం”తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విజయ్ స్టార్ డమ్ మరింత పెరిగిపోయింది. అయితే మన రౌడీ ప్రస్తుతం ఏమి చేసినా సంచలనమే. ప్రతివిషయం హాట్ టాపిక్ అయిపోతుంది. తాజాగా ఉన్నట్టుండి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు విజయ్. రౌడీ తీసుకున్న ఈ నిర్ణయంతో దర్శకులకు షాక్ లో ఎం చేయాలో పాలుపోవడంలేదు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి అనే కదా…. అదేనండి ఇక నుంచి ఈ రౌడీ ప్రేమకథ చిత్రాలు చేయడట. అంతే ఈ మాట వినగానే టాలీవుడ్ దర్శకులు విజయ్ కోసం రాసుకున్న కథలు ఎం చేయాలో తెలియక షాక్ లో ఉన్నారట.

అయితే విజయ్ తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసందే.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో మాట్లాడుతూ తనకు లవ్ స్టోరీస్ చేయడం ఇష్టం లేదని తేల్చిచెప్పాడు. వరల్డ్ ఫేమస్ లవర్ నా చివరి ప్రేమ కధ అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ మాటలకి అక్కడి వారంతా షాక్ అయ్యారు. అయితే అర్జున్ రెడ్డి లాంటి లవ్ స్టోరీ తీసిన తరువాత విజయ్ కి వచ్చిన సినిమాలు అన్ని లవ్ స్టోరీసే.. అయితే ఆ లవ్ స్టోరీస్ పై విజయ్ కి విమర్శలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వార్డల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా అర్జున్ రెడ్డి లనే ఉందని పోల్చడంతో రౌడీ కాస్త హర్ట్ అయ్యాడట. అందుకే కొద్దిరోజులు లవ్ స్టోరీస్ కి బ్రేక్ ఇద్దామని డిసైడ్ అయ్యాడని టాక్. అయితే విజయ్ ప్రస్తుతం ఫోకస్ అంతా మాస్ కథలపై ఉందట. కమర్షియల్ ఎలెమెంట్స్ తో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడట. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాద్ చిత్రం “ఫైటర్” చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్ ప్రెజెంట్స్, పూరి కన్నెక్ట్స్, పూరి జగన్నాద్ టూరింగ్ టాకీస్ పతాకంపై తెలుగు, హిందీ, మరియు ఇతర దక్షిణ భారత భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం కోసం విజయ్ బాగానే కసరత్తు చేస్తున్నాడు, ఇటీవలే ఈ రౌడీ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలుగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ పోషిస్తున్నారట. అయితే విజయను పూరి ఎలా చూపిస్తాడా అని రౌడీ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూసున్నారు.

“వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా ట్రైలర్ మీకోసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here