Vijay Thalapathy: ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో ఇతర భాష హీరోలు కూడా తెలుగు చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇతర భాష హీరోలు నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యేవి.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో ఇతర భాష హీరోలు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇదివరకే పలువురు హీరోలు తెలుగు దర్శకులు తెలుగు నిర్మాణ సంస్థలలో చిత్రాలు నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ సైతం వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.
ఇలా వారసుడు సినిమా ద్వారా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ మరో టాలీవుడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.క్రాక్ వీరసింహారెడ్డి వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నట్లు సమాచారం.

Vijay Thalapathy: గోపీచంద్ డైరెక్షన్ లో విజయ్…
ఇప్పటికే గోపీచంద్ మలినేని హీరో విజయ్ ని కలిసి తనకు సినిమా కథ వినిపించగా ఈ స్క్రిప్ నచ్చడంతో వెంటనే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఇక గోపీచంద్ డైరెక్షన్ అంటే విజయ్ ఈ సినిమాతో తెలుగులో హిట్ కొట్టడం గ్యారెంటీ అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.































