CVL Narasimha Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, అడ్వకేట్ గా పలు సినిమాలలో నటించిన సీవీల్ నరసింహారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటి విజయశాంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయశాంతికి ఇండస్ట్రీలో మెంబర్షిప్ కార్డు ఇవ్వకుండా తనని దారుణంగా అవమానించారు. అదేవిధంగా అంత పెద్ద నటి అయినప్పటికీ వజ్రోత్సవ కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమానికి తనని ఆహ్వానించకుండా తనను దారుణంగా అవమానించారని ఈ సందర్భంగా నరసింహారావు వెల్లడించారు.

ఇకపోతే నరసింహారావు వృత్తిపరంగా లాయర్ కావడంతో లాయర్లు సాధారణంగా మోసపోరు అంటారు మీరు ఎప్పుడైనా మోసపోయా అని ప్రశ్నించగా ఆయన చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ సినిమా విడుదలకు ముందు మేము రక్ష అనే ఒక ఆర్గనైజేషన్ ఫౌండేషన్ స్థాపించాము.
ఈ ఫౌండేషన్ ద్వారా యాంటీ కరప్షన్ వింగ్ అని పెట్టాము. దీంతో డీజీపీ అందరూ పాల్గొని కరెక్షన్ ఉండకూడదు అంటూ ఎన్నో నియమాలు పెట్టాము. ఆ సమయంలోనే ఠాగూర్ సినిమా వస్తుందని తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేసాము. ఇక ఠాగూర్ సినిమా తెరకెక్కుతుండగా ప్రొడ్యూసర్ లతో కలిసి ఫర్ యు అనే ఒక వెబ్సైట్ పెట్టి పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేయాలని భావించాము.

చిరంజీవిని కలవలేము…
అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లు చూసిన తర్వాత మా వెబ్ సైట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక మనం ఈ వెబ్ సైట్ ద్వారా ప్రమోషన్ చేయాల్సిన పనిలేదు. సినిమా మంచి హిట్ అయింది ఇక వెబ్ సైట్ తో పని లేదని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత ఇలా కూడా ఉంటారా అని అనుకున్నాను. మరి ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లలేదా అంటే.. అప్పట్లో మనం చిరంజీవి గారిని డైరెక్టుగా కలవలేము కనుక ఈ విషయం అతని వరకు వెళ్లలేదని నరసింహారావు వెల్లడించారు.
































