Vikramarkudu Child Artist: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి చిన్నప్పటి నుంచి హీరో హీరోయిన్ల పాత్రలలో నటించడం కోసం లేదా వారి పిల్లల పాత్రలలో నటించడం కోసం ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి వస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు తర్వాత హీరో హీరోయిన్లుగా అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రవితేజ అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన విక్రమార్కుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ అభినయంతో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ కూతురు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
తన అమాయకపు చూపులతో మాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ చిన్నారి పేరు నేహా తోట.అమెరికాలో జన్మించిన ఈమె తాను జన్మించిన తర్వాత తన తల్లిదండ్రులు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడంతో ఇక ఈమె ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. అయితే చదువుపై ఉన్న ఆసక్తితో ఈమె పూర్తి దృష్టిని చదువులపై పెట్టినట్లు తెలుస్తోంది.

Vikramarkudu Child Artist: చదువులపై దృష్టి పెట్టిన నేహా..
ప్రస్తుతం నేహాతోట ఎంబీఏ చదువుతున్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నేహాతోట తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు .అలాగే తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేయడంతో అసలు విక్రమార్కుడు సినిమాలో చిన్నారి నేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూనేటిజన్స్ కామెంట్ చేయడంతో చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలపై ఆసక్తి పెడతానంటూ ఈమె చెప్పుకొస్తున్నారు.































