వ్యాక్సిన్ వేసుకుంటే సంసారానికి పనికిరామంటూ నదిలోకి దూకిన జనం..?

0
344

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి బయట పడటం కోసం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల వ్యాధి బారిన పడిన పెద్ద ప్రమాదం తలెత్తదని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే మన తెలుగు రాష్ట్రాలలో 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం అధికారులు వ్యాక్సిన్ వేస్తామంటూ వైద్య బృందం శిసోడా గ్రామానికి చేరుకోగా ఆ గ్రామస్తులు మాత్రం ‘‘వ్యాక్సిన్ వద్దు మొర్రో’’ అని పరుగులు తీశారు.సుమారు 200 మంది సరాయూ నదీ తీరానికి చేరారు. వారికి వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అధికారులు తెలియజేస్తున్న సమయంలో కొందరు యువకులు నదిలోకి దూకి టీకా వద్దని నిరసన వ్యక్తం చేయడంతో వైద్యాధికారులు వెనుదిరిగారు.

ఈ క్రమంలోనే అధికారులు ఎందుకు వాక్సిన్ వద్దంటున్నారు అనే ప్రశ్నను స్థానికంగా ఓ రైతును ప్రశ్నించగా.. అందుకు వారు విచిత్రమైన సమాధానాలు తెలియజేశారు. ఇప్పటికీ తమకు తెలిసిన వారు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ చనిపోతున్నారని, చనిపోవడానికి వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకని వారు తెలియజేశారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని పురుషులు సంసారానికి పనికిరారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు తెలియజేయడంతో కేవలం 18 మంది మాత్రమే వాక్సిన్ తీసుకున్నారని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ పట్ల ఇలాంటివన్నీ కేవలం వదంతులు మాత్రమే, ఇలాంటి అపోహలు నమ్మి వ్యాక్సిన్ తీసుకోకపోతే పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ మహమ్మారి నుంచి బయట పడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని అధికారులు తెలియజేశారు.