viral News: న్యూస్ రీడర్ అన్న తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.అయితే కొన్నిసార్లు మనసుకు బాధ కలిగించే విషయాలు లేదా సంఘటనలు జరిగినప్పుడు అలాంటి వార్తలను చదవడానికి సైతం ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎన్నోసార్లు వార్తలు చదువుతూ ఎంతోమంది లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.

తాజాగా ఇలాంటి ఘటన మరోసారి చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 ఒక న్యూస్ డిబేట్ లో భాగంగా పాల్గొన్నటువంటి యాంకర్ ప్రత్యూష ఏకంగా లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ విధంగా ఈమె కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

గత కొద్ది రోజుల క్రితం మంగళగిరికి చెందిన వివాహిత ప్రత్యూషకు లోన్ వేధింపుల కారణంగా ఈ నెల 12వ తేదీ ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి డిబేట్ నిర్వహించిన న్యూస్ ఛానల్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా ప్రత్యూష వ్యవహరించారు.
నేను మహిళనే అంటూ ఎమోషనల్ అయిన యాంకర్…
ఇక ఈ విషయం గురించి చనిపోయిన వివాహిత ప్రత్యూష తల్లి ఫోన్లో మాట్లాడుతూ తన కూతురిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యి ఏడవగా ప్రత్యూష సైతం ఆమె మాటలు విని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. నేను మహిళనే… నాకు భావోద్వేగాలు ఉంటాయి అంటూ ఈ సందర్భంగా ప్రత్యూష ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం వైరల్ అవుతుంది.