మనం చిన్న తనంలో సర్కస్ లు చాలా వరకు చూసి ఉంటాం. ఇప్పుడు కూడా అక్కడ అక్కడ జరుగుతూ ఉంటాయి. అందులో వాళ్లు చేసే విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొన్ని విన్యాసాలు చూస్తుంటే ఎంతో భయానకంగా ఉంటాయి. కానీ వాళ్లు ఎంతో ప్రాక్టీస్ చేస్తే గానీ.. అలా వాళ్లు చేయలేరు. అయితే ఇలా ఓ వ్యక్తి జనావాసాల్లోకి అలాంటి విన్యాసం ఒకటి చేయబోయాడు.

కానీ అది అతడి ప్రాణం మీదకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంత మంది ధైర్యంగా ఉన్నానని.. తనకు తాను నిరూపించుకోవడానికి కొన్ని విన్యాసాలు చేస్తుంటారు. తన తెలివి తేటలను తన ఊరి ప్రజలకు చూపిద్దామనుకున్నాడు. నోట్లో కిరోసిన్ పోసుకొని.. చేతిలో అగ్గిపుల్ల వెలిగించాడు. నోటి నుంచి ఆ కిరోసిన్ ఊది పెద్ద మంటను బయట చూపించాడు.
అప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఒక్కసారిగి ఆ మంటలు తన నోటికి కూడా తాకాయి. అక్కడ నుంచి శరీరం మొత్తం అంటుకొంటుండగా.. చుట్టు పక్కల జనాలు అలర్ట్ అయ్యి మంటలను ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ వీడియోను ఓ వ్యక్తి రికార్టు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక విన్యాసం చేయాలంటే.. 100 సార్లు ఆలోచించాలి.. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఇలాంటివి పాల్పడితే ఇలానే జరుగుతుందంటూ.. ఓ వ్యక్తి ఘాటుగా కామెంట్ చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో ఈ ఫైర్ స్టంట్ వీడియో వైరల్ అవుతోంది. ప్రతీ విన్యాసం విజయవంతం అవ్వాలని లేదు.. కానీ ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఈ వీడియో కింద రీ ట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు.
































