ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మంచి ఉంటే.. మరికొన్ని చెడుకు ఉంటున్నాయి. ఏదైనా నెటిజన్లు మంచిని ఆదరిస్తున్నారు.. చెడు ఉంటే కామెంట్లలో తిట్టి పోస్తున్నారు.

అయితే ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు హిందీ పాటలకు ఐదుగురు కలిసి డ్యాన్స్ వేశారు. దీనిని అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయురాలు వీడియో తీశారు. దీంతో అది వైరల్ అయింది. ఉన్నతాధికారుల వరకు ఆ విషయం వెళ్లడంతో వారిని సస్పెండ్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలోని ఓ ప్రభుత్వా ప్రైమరీ పాఠశాలలో వారు ఐదుగురు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అందులో ఒకరు హెడ్ మాస్టార్ కాగా మిగిలిని నలుగురు అసిస్టెంట్ హోదా కలిగి ఉన్నారు. వాళ్లంతో తరగతి గదిలో హిందీ పాటలకు డ్యాన్స్ వేశారు. దానిని వీడియో తీయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఉన్నత విద్యాధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో ఉపాధ్యాయు నియమ నిబంధనలకు విరుద్దంగా.. విద్యాశాఖ ప్రతిష్టను దెబ్బ తీశారనే ఉద్దేశ్యంతో వారిని విద్యాధికారి బ్రజరాజ్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని వారిని కోరగా.. అందులో నలుగురు సమాధానం చెప్పగా.. మరొకరు ఇంకా వివరణ ఇవ్వలేదు. ఈ వీడియో మార్చినాటిది కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.































