రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ.. సీక్రెట్ మీట్ పై క్లారిటీ!

0
133

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతోనే మంచి విజయాలను సొంతం చేసుకుని వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు. వీరిద్దరు జంటగా నటించిన “గీత గోవిందం”,”డియర్ కామ్రేడ్”చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకులు నిజంగానే వీరి మధ్య ఏదో నడుస్తోందని ఊహాగానాలు తీశారు.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఈ జంట మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరికీ వీలు దొరికినప్పుడల్లా బయట కలుస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ముంబైలో ఓ రెస్టారెంట్లో ఈ జంట కెమెరా కంటపడటంతో అందరిలో ఉన్న అనుమానానికి మరింత బలం చేకూరింది.

ముంబై హోటల్ లో వీరిద్దరు జంటగా కనిపించడమే కాకుండా రష్మికా చేతిలో ఫ్లవర్ బొకే ఉండటంతో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి నటువంటి వీడియో బయటకు రావడంతో వీరిద్దరి సీక్రెట్ గా కలిసిన విషయం గురించి క్లారిటీ వచ్చింది.

ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ఒక కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ఈ షూట్ ముంబైలోని ఒక రెస్టారెంట్లో జరిగింది. త్వరలోనే టెలికాస్ట్ కాబోయే ఈ యాడ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ రష్మికకు మోకాళ్లపై కూర్చుని ఏదో గిఫ్ట్ ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది. ఈ వీడియోలో ఈ జంటను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.గత కొన్ని రోజుల నుంచి ఎంతో హాట్ టాపిక్ గా ఉన్న వీరు సీక్రెట్ మీటింగ్ గురించి మొత్తానికి ఈ విధంగా క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here