Vishakha news : తల్లి అవ్వడమంటే ఒక స్త్రీ జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి. అందుకోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. పెళ్లయ్యాక పిల్లలను కని అమ్మ అనిపించుకోవాలని ఎంతో ఆశపడుతారు. కానీ తల్లే బిడ్డ పాలిట యామపాశమై చంపాలని భావిస్తే… అలాంటి పరిస్థితే ఒక శిశువుకి వచ్చింది. ఇలాంటి తల్లి కూడా ఉంటుందా అనే ఘటన వైజాగ్ లోని ఆరిలోవ ప్రాంతంలో జరిగింది.

భయంతో మేడ పైనుండి తోసేసిన తల్లి…
అరిలోవ కి చెందిన మహిళ తన కన్నబిడ్డను ప్రసవించగానే మేడ మీద నుండి కిందకు పడేసింది. వివరాల్లోకి వెళితే కాకినాడ కి చెందిన యువతికి, ఆమె పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చగా గర్భాశయం తీసేయాలని కాకినాడ లోని వైద్యులు చెప్పి తీసేసారంటూ సదరు యువతి చెబుతున్నారు. అయితే తనకు మళ్ళీ కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ వెళ్లగా కడుపులో గడ్డ ఉందని తెలిపారు. ఇక గర్భాశయం లేకపోవడం వల్ల తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ప్రేమికుడితో శారీరకంగా కలిసిన యువతి గర్భం దాల్చింది.

అయితే తనకు గర్భం వచ్చినట్లు తనకు తెలియకపోవడం అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చినా అది గడ్డ వల్లే అనుకుందట. అయితే స్కానింగ్స్ కానీ ఏమి తీయకుండా డాక్టర్స్ కూడా గడ్డ ఉంది చికిత్స చేయాలనే చెప్పారంటూ యువతి చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి నుండి కడుపు నొప్పి తీవ్రమవ్వగా టాబ్లెట్ వేసుకున్నానని అయితే ఉదయం 8 గంటల సమయంలో ప్రసవం జరిగిందని తెలిపింది. బిడ్డ బయటికి రాగానే భయం వేసిందని అందుకే బిడ్డను పై నుండి కిందకి పడేసానని తెలిపింది. అయితే శిశువును వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఆ యువతి ప్రేమికుడే బిడ్డను హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు.































