Vishnu Priya: బుల్లితెర యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి పరిచయం అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా ఈమె బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందర్శించే వాళ్ళు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విష్ణు ప్రియ తన ఫేస్ బుక్ పేజ్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి అందరూ కూడా ఫేస్ బుక్ పేజ్ అన్ ఫాలో కండి అంటూ సూచించారు. అయితే ఇలా హ్యాకింగ్ కి గురైన విష్ణు ప్రియ ఫేస్ బుక్ పేజ్ నుంచి కొందరు మహిళల అశ్లీల ఫోటోలు వీడియోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులందరూ కంగు తిన్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకొని షాక్ అయినటువంటి విష్ణు ప్రియ వెంటనే అలర్ట్ అవుతూ అసలు విషయాన్ని వెల్లడించారు. గత కొద్ది రోజుల నుంచి ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఇలాంటి ఫోటోలు వైరల్ కావడంతో ఆ ఫోటోలకు నాకు ఏమాత్రం సంబంధం లేదని తన ఫేస్ బుక్ పేజ్ హ్యాకింగ్ కు గురైనట్టు చెప్పుకొచ్చారు.

Vishnu Priya: సైబర్ క్రైమ్ ను ఆశ్రయించని విష్ణుప్రియ..
ఈ మధ్యకాలంలో ఈమె ఫేస్ బుక్ పేజ్ నుంచి ఇలాంటి ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో విష్ణు ప్రియ ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇలాంటి అభ్యంతరకరమైన ఫోటోలు వీడియోలు రావడంతో ఈమె నాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ ఇప్పటివరకు తన ఫేస్ బుక్ పేజ్ హ్యాకింగ్ కు గురైందని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించకపోవడంతో కొందరు విష్ణు ప్రియనే ఇలా చేస్తున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.

































