Vishnu Priya: విష్ణు ప్రియ పరిచయం అవసరం లేని పేరు ఈమె బుల్లితెర యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా సందడి చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే విష్ణు ప్రియ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో అందాల నారబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక బోల్డ్ డాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విష్ణు ప్రియ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.ఇకపోతే ఈమె ఏదైనా ఒక షోలో పాల్గొన్న 50 నుంచి 70 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
మొత్తానికి బుల్లితెర కార్యక్రమాల ద్వారాను సోషల్ మీడియా ద్వారా విష్ణుప్రియ భారీగా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన సమయం నుంచి మొదలుకొని సుమారు పది కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం. ఇక మణికొండలో విష్ణు ప్రియకు సొంత ఫ్లాట్ కూడా ఉందని తెలుస్తుంది.

Vishnu Priya: భారీగా ఆస్తులు పోగు చేసిన విష్ణు ప్రియ….
ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ సుదీర్ తో కలిసి పోవే పోరా కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమయ్యారు. అయితే ఈ కార్యక్రమం మంచి హిట్ అవడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఈమెకు బుల్లితెర అవకాశాలు తగ్గాయని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె సుదీర్ తో కలిసి వాంటెడ్ పండు గాడ్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది.































