Vishnu Priya: బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఈమె తాజాగా వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.అయితే ప్రస్తుతం ఈమెకు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా ఈమె తరచూ బోల్డ్ డాన్స్ వీడియోలతో సందడి చేయడమే కాకుండా బోల్డ్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరోసారి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తూ తడిసిన అందాలతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.
ఇలా ఈమె షేర్ చేస్తున్న ఈ ఫోటోలు చూస్తుంటే తను వెకేషన్ లో ఉన్నట్టు అర్థం అవుతుంది. ఈమె ప్రస్తుతం మలేషియా హాలిడే వెకేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈమెతో పాటు జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి కూడా ఈ వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది.ఇలా వీరిద్దరూ కలిసి హాలిడే వెకేషన్లో చిల్ అవుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

Vishnu Priya:సముద్ర తీరాన చిల్ అవుతున్న విష్ణు ప్రియ….
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లైఫ్ అంటే మీదే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈమె మలేషియా వెకేషన్ లో ఉన్నారా లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీళ్ళు వెళ్లినటువంటి ఫోటోలను ఇప్పుడు షేర్ చేశారా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

































