Vishnu priya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా అలాగే నటిగా ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఈమెకు ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా విష్ణు ప్రియ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఏమాత్రం అదుపు లేకుండా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సందడి చేస్తున్నటువంటి ఈమె ఫేస్ బుక్ పేజ్ తాజాగా హ్యాకింగ్ గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ ఫేస్ బుక్ పేజ్ నుంచి కొందరు మహిళలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు వీడియోలు కావడంతో ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలోనే తన ఫేస్ బుక్ పేజ్ నుంచి వచ్చినటువంటి అశ్లీల ఫోటోలపై విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించి అసలు విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ తన ఫేస్ బుక్ పేజ్ హ్యాకింగ్ కి గురైయిందని దయచేసి ప్రతి ఒక్కరు తన ఫేస్ బుక్ పేజ్ అన్ ఫాలో కావాలని ఈమె రిక్వెస్ట్ చేశారు.అదేవిధంగా ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి అంటూ కోరారు.

Vishnu priya: చేదు అనుభవాన్ని మిగిల్చిన వాంటెడ్ పండుగాడ్…
ఇలా తన ఫేస్ బుక్ పేజ్ నుంచి ఈ విధమైనటువంటి ఫోటోలు రావడంతో కంగారు పడిపోయిన విష్ణు ప్రియ వెంటనే అసలు విషయం అందరికీ తెలియజేశారు. విషయానికి వస్తే వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక బిగ్ బాస్ మానస్ తో కలిసి ఈమె ఒక ప్రైవేట్ వీడియో సాంగ్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.


































