విటమిన్ బి12 లోపంతో బాధ పడుతున్నారా… అయితే ఈ ఆహారం తప్పనిసరి..!

0
401

సాధారణంగా మన శరీరంలోని అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తప్పనిసరిగా మన శరీరానికి తగినంత స్థాయిలో విటమిన్లు సమృద్ధిగా లభించాలి. ఈ విధంగా విటమిన్లు సరైన మోతాదులో ఉన్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలము. అయితే కొన్నిసార్లు మనలో తీవ్రమైన విటమిన్స్ లోపం తలెత్తుతుంది. ముఖ్యంగా విటమిన్ బి12 లోపంతో బాధపడే వారిలో తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విధమైనటువంటి విటమిన్ లోపంతో బాధపడేవారు ఈ క్రింది తెలిపిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.

సాల్మన్ చేపలు: విటమిన్ బి12 లోపంతో బాధపడే వారు తరచుగా వారి ఆహారంలో భాగంగా సాల్మన్ చేపలను తీసుకోవాలి.ఇందులో బీ విటమిన్, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బీ12 విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. అదేవిధంగా ట్యూనా చేపలలో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

గుడ్లు: సాధారణంగా గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గుడ్డు లో ఉన్నటువంటి పచ్చ సొన తినడం వల్ల విటమిన్ బీ12 ను పుష్కలంగా పొందవచ్చు.

తాజా పండ్లు కూరగాయలు: తాజా పండ్లు కూరగాయలలో అధికమొత్తంలో మనకు విటమిన్లు లభ్యమవుతాయి. ఈ విధంగా ఏ సీజన్లో లభించే పండ్లు కూరగాయలను తరచూ తీసుకోవడం వల్ల విటమిన్ బీ12 ను పుష్కలంగా పొందవచ్చు.