Actor Naresh: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే హీరో హీరోయిన్లకు కారవ్యాన్ ఉండటం సర్వసాధారణం.ఈ విధంగా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లు వారికి అనుగుణంగా అన్ని సదుపాయాలతో ప్రత్యేకంగా ఈ కారవ్యాన్ ఏర్పాటు చేయించుకొని షూటింగ్ లొకేషన్ కి వెళుతుంటారు. వారిపై షాట్ పూర్తికాగానే చాలామంది నటీనటులు ఈ కారవ్యాన్ లో రెస్ట్ తీసుకుంటూ అనంతరం తదుపరి షాట్ కి రెడీ అవుతారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు ఎంతో విలువ చేసే కారవ్యాన్ లను కొనుగోలు చేశారు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నరేష్ సైతం కారవ్యాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కారవ్యాన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా సొంతంగా కారవ్యాన్ లేదు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇతరుల కారవ్యాన్ ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదని భావించిన నరేష్ సొంతంగా కారవ్యాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ముంబై నుంచి ఈ
కారవ్యాన్ అన్ని సదుపాయాలతో తయారు చేయించారని సమాచారం.
కారవ్యాన్ ప్రత్యేకతలు ఇవే..
కొన్ని కోట్ల ఖరీదు చేసే ఈ కారవ్యాన్ లో వెయిటింగ్ రూమ్, ఏసి బెడ్ రూమ్, మేకప్ ప్లేస్, జిమ్, వాష్ రూమ్ వంటి సదుపాయాలతో ఈ కారవ్యాన్ ను రూపొందించారు. ప్రస్తుతం నరేష్ కారవ్యాన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈయన కెరీర్ లో హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ ఏడాది నుంచి ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభిస్తున్నట్లు తాజాగా నరేష్ వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.































