Vyjayanthi Banner: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతం కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాణ సంస్థలలో వైజయంతి బ్యానర్ ఒకటి. కృష్ణా జిల్లాకు చెందిన అశ్వినీ దత్ సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలను తన బ్యానర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇక ఈ మధ్యకాలంలో వైజయంతి బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అశ్వినీ దత్ వారసురాలిగా ఆయన కూతురు కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇలా వైజయంతి బ్యానర్ ద్వారా ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇకపోతే లోగో మధ్యలో నందమూరి తారక రామారావు గారు శంఖం పట్టుకొని రామం చేస్తున్న ఫోటో ఉంటుంది.అసలు వైజయంతి బ్యానర్ లో ఇలా అన్నగారి ఫోటో ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నిజానికి ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు ఇలా తమ వ్యక్తిగత ప్రచారానికి ఏమాత్రం ఇష్టపడరు.అయితే అశ్విని దత్ తాను స్థాపించిన వైజయంతి బ్యానర్ కు అన్న గారి ఫోటో పెడతానంటూ ఎన్నోసార్లు ఎన్టీఆర్ గారిని అడిగారట. అందుకు ఎన్టీఆర్ ఏ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది.

Vyjayanthi Banner ఎన్టీఆర్ కు ఏమాత్రం ఇష్టం లేదా..
ఎన్టీఆర్ ఒప్పుకోకపోయినా తరచూ ఇదే విషయం గురించి ఎన్టీఆర్ వెంట పడుతూ అశ్వినీ దత్ అడగడంతో ఒప్పుకోకపోతే బాగుండదన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ తన ఫోటో పెట్టడానికి ఒప్పుకున్నారట. ఇలా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్టీఆర్ ఫోటో ఉంది అయితే అశ్విని దత్ ఇలా ఎన్టీఆర్ గారి ఫోటోని పెట్టడానికి సరైన కారణం మాత్రం తెలియదు.





























