సాధారణంగా మనం మన జీవితంలో కొన్ని వస్తువులను పోగొట్టుకోవడం సర్వసాధారణమే. ఏదైనా హడావిడిలో పడి కొన్ని వస్తువులను మర్చిపోవడంలేదా మన అజాగ్రత్త కారణంగా ఎంతో విలువైన వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా పోయిన వస్తువుల గురించి ఎంతో బాధపడుతూ పోగొట్టు పోయిన వస్తువు గురించి అన్నిచోట్లా వెతుకుతాము. అయితే అది కనిపించకపోతే కొన్ని రోజులకు వాటి గురించి మర్చి పోతాము. అయితే ఆ వస్తువుల గురించి మర్చి పోయిన తర్వాత అవి దొరికితే మన ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ప్రస్తుతం అలాంటి ఆనందమే దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ సంబరపడిపోతుంది.

దక్షిణ కాలిఫోర్నియాలోని మెజిస్టిక్ వెంచూరా థియేటర్ లో పనిచేసే ఓ మహిళ 20 సంవత్సరాల క్రితం తన పర్స్ పోగొట్టుకొంది. తన పర్సు కోసం థియేటర్ మొత్తం ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆమె ఆ ఫర్స్ గురించి ఆశలు వదులుకుంది. అయితే ఆ పర్స్ లో ఆమె డ్రైవింగ్ లైసెన్స్, తన తల్లి ఫోటోలు ఉన్నాయి. ఎంత వెతికినా బస్సు దొరకకపోవడంతో దాని పై ఆశలు వదులుకుంది.
తాజాగా థియేటర్ రీమోడలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న టామ్ స్టెవెన్ అనే యువకుడికి టికెట్లు, సోడా క్యాన్ పెట్టే ప్రాంతంలో కనిపించింది.ఈ క్రమంలోనే ఆ యువకుడు కోలీన్ డిస్టిన్ అంటే ఎవరు మీకు తెలుసా ? అంటూ ఆ పర్స్ లో ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ పోస్ట్ చేసిన మహిళ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఒకప్పటి ఎరుపు రంగులో ఉన్న తన పర్సు ఇన్ని రోజులకు బ్రౌన్ రంగులోకి మారిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి తన డ్రైవింగ్ లైసెన్స్ తన తల్లి ఫోటో ఏ మాత్రం చెక్కు చెదరడంలేదని అవన్నీ చూసిన కోలీన్ కొంతమేర భావోద్వేగానికి గురయ్యారు.




























