Waltair Veerayya: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వాల్తేరు వీరయ్య… సినిమా ఎలా ఉందంటే?

0
99

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వటంతో నెక్స్ట్ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని భావించిన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాని సౌత్ ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా చిరు తన స్థాయికి తగ్గట్టు అందుకోలేకపోయినా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం చిరంజీవి సంక్రాంతి బరిలోకి దిగటానికి సిద్ధంగా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో ఈ సినిమా పక్క మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని చిరు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తి అయ్యాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా మెగా అభిమానులు సంబరాలు జరుపుకునేలా ఉందని సెన్సార్ బోర్డు సభ్యుల నుండి టాక్ వినిపిస్తోంది.

Waltair Veerayya: మెగా అభిమానులకు మాస్ జాతర…

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ కనిపించనుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. శ్లోక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు అక్కడ కూడా చిరు రిలీజ్ చేయటానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ జనవరి 12 వేయనున్నట్టు ప్రకటించారు. ఇక సౌత్ లో ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుండటంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు మొదలుపెట్టారు.