Thammareddy Bharadwaja: గత కొన్ని నెలల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఈ టికెట్ల వ్యవహారం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికీ ఏపీ ముఖ్యమంత్రితో పలుమార్లు సినీ ప్రముఖులు చర్చలు జరిపిన ఈ విషయం కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత త్వరలోనే కొత్త జీవో విడుదల చేస్తారని అందరూ శుభవార్త వింటారని తెలిపారు.

అయితే తాజాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. అసలు సినీ పెద్దలు ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటే వారికి ఏదైనా వ్యక్తిగత సమస్య ఉండటం వల్ల వెళ్తున్నారో ఏమో కానీ సినిమా పరిశ్రమలో ఏ విధమైనటువంటి సమస్య లేదని ఆయన తెలియచేశారు. అవును సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య లేదని… సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు నష్టపోతారు కదా అనే ప్రశ్న ఆయనకు ఎదురవగా….భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయితే దేశ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. అలాంటప్పుడు ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం వస్తుంది.
ఆ సినిమాలకు లేని సమస్య మీకెందుకు….
ఇలా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడం వల్ల పెద్ద సినిమాలకు కూడా ఎలాంటి నష్టం రాదని తమ్మారెడ్డి వెల్లడించారు. ఇలా భారీ బడ్జెట్ చిత్రాలు అధిక థియేటర్లలో విడుదల చేస్తూ సినిమా టికెట్లు రేట్లు పెంచి జనాల డబ్బులు మొత్తం దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? దోపిడీని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. భారీ బడ్జెట్ చిత్రాలు అంటే ఊర్లో ఉన్న థియేటర్లు మొత్తం వాళ్ళు తీసుకుంటారు అలాంటప్పుడు సినిమా టికెట్ల రేట్లను పెంచి జనాల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలకు లేని సమస్య మీకెందుకు అంటూ సినిమా టిక్కెట్ల రేట్లపై తమ్మారెడ్డి భరద్వాజ్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
































