ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’పై తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దాదాపు రూ. 80 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ‘దేవర’ హక్కులు కూడా నాగవంశీ సొంతం చేసుకోగా, ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘వార్ 2’ విషయంలోనూ అదే నమ్మకంతో భారీ మొత్తాన్ని వెచ్చించారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ థియేట్రికల్ బిజినెస్:
‘వార్ 2’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చాలా బలంగా జరిగింది. ఏరియాల వారీగా జరిగిన బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి:
- నైజాం: రూ. 30 కోట్లు
- సీడెడ్: రూ. 18 కోట్లు
- ఉత్తరాంధ్ర: రూ. 10 కోట్లు
- ఈస్ట్: రూ. 3 కోట్లు
- వెస్ట్: రూ. 3 కోట్లు
- గుంటూరు: రూ. 3.5 కోట్లు
- కృష్ణా: రూ. 4 కోట్లు
- నెల్లూరు: రూ. 3 కోట్లు
ఈ మొత్తం ఏపీ + తెలంగాణ కలిపి రూ. 74.5 కోట్ల బిజినెస్ జరిగింది. దీనికి అదనంగా రెస్ట్ ఆఫ్ ఇండియా (తెలుగు వెర్షన్) నుంచి రూ. 4 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ. 4 కోట్లు కలిపి వరల్డ్ వైడ్‌గా ‘వార్ 2’ (తెలుగు వెర్షన్) మొత్తం బిజినెస్ రూ. 87.5 కోట్లకు చేరుకుంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరియు సినిమా భవిష్యత్తు:
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ. 88 కోట్ల షేర్ రాబట్టాలి. కేవలం ఎన్టీఆర్ స్టార్ పవర్ మీదనే ఇంత భారీ బిజినెస్ జరిగిందని చెప్పాలి. సినిమా విడులైన వెంటనే పాజిటివ్ టాక్ వస్తే, ఈ చిత్రం సునాయాసంగా బ్రేక్ ఈవెన్ దాటేసి బంపర్ హిట్ సాధించే అవకాశం ఉంది. అయితే, నెగటివ్ టాక్ వస్తే మాత్రం బయ్యర్లకు నష్టాలు తప్పకపోవచ్చు.
ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబో, అయాన్ ముఖర్జీ దర్శకత్వం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మరియు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్రాండింగ్ వంటి అంశాలన్నీ కలిసి ‘వార్ 2’ ను తెలుగు రాష్ట్రాల్లో మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలబెడతాయేమో వేచి చూడాలి.


























