ఆ రెండు రోజులు గుండెపోటు వస్తే బతికే అవకాశం తక్కువంట..!

0
290

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు గుండెజబ్బుల బారిన పడి చనిపోతున్నారు. వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం 30 ఏళ్ల దాటిన వాళ్లు సైతం గుండెజబ్బుల బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు మరింత ఎక్కువ. పని ఒత్తిడి కూడా కొందరిలో గుండెజబ్బులకు కారణమవుతోంది. యూకేకు చెందిన పరిశోధకులు గుండె జబ్బులపై పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శాస్త్రవేత్తల పరిశోధనల్లో వీకెండ్ లో గుండెపోటు వస్తే బ్రతికే అవకాశం లేదని.. వీక్ డేస్ లో గుండెపోటు వస్తే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా శాస్త్రవేత్తలు శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలవరకు గుండెజబ్బుల బారిన పడిన వారి డేటాను, మిగిలిన రోజుల్లో గుండెజబ్బుల బారిన పడ్డ వాళ్ల డేటాను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.

శని, ఆదివారాల్లో గుండెపోటు వస్తే బ్రతికే అవకాశాలు చాలా తక్కువని పేర్కొన్నారు. వీకెండ్ లో హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్లలో కేవలం 20 శాతం మందికి మాత్రమే ఎలాంటి ముప్పు ఉండదని పేర్కొన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ స్కిన్స్ సింపోజియం సదస్సులో యూకే పరిశోధకులు సైతం ఇవే విషయాలను వెల్లడించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న అహారం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని .. చెడు ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స చేయించుకుని వైద్యులు సూచించిన మందులు వాడితే గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.