బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. బరువు పెరగడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. అయితే ఇందులో కూడా కొన్ని ఆహార పదార్థాలు తింటే బరువు పెరుగుతాం. కొన్ని తింటే బరువు తగ్గుతాం. దీనికి కారణం కొవ్వు పెంచే పదర్థాలు ఉండటం.. మరికొన్ని వాటిల్లో కొవ్వును కరిగించే లక్షణాలుండటం. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో ఓ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడంలో సహజ పద్దతిని అనుసరించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఓవైపు బరువు తగ్గుతూనే, మరోవైపు నీరసం రాకుండా… ఫిట్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాంటి అవకాశం ఇచ్చే ఆహార పదార్థాల్ని “వెయిట్ లాస్ ఫ్రెండ్లీ డైట్” అని పిలుస్తున్నారు. సాధారణంగా గ్రీన్ టీ, హెర్బల్ టీలు బరువును తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.
కానీ ప్రతీ రోజు వాటిని తాగడం కూడా బోర్ కొడుతుంది. వాటిని రోజూ తాగాలంటే ఆసక్తి ఉండకపోవచ్చు. అందువల్ల వైద్యులు ఒక మంచి టీను సూచిస్తున్నారు. ఆ టీ ఏంటంటే.. యాపిల్ మరియు అల్లంతో కలిపిన టీ. బరువును నియంత్రించడంతో పాటు కొవ్వును సులభంగా కరిగించడంలో బాగా పని చేస్తుంది. ఈ టీ తయారు చేయాలంటే అందులో పాలు కలపాల్సిన అవసరం లేదు. యాపిల్ లో కేలరీలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడంతో పాటు ఆకలిని తగ్గిస్తుంది. అల్లంలో కూడా కొవ్వును తగ్గించే పోషకాలు ఉంటాయి.
దీంతో బరువును తగ్గించడంలో ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా యాపిల్ ముక్కలుగా చేసి అల్లంతో కలిపి మిక్సీలో వెయ్యాలి. దీనిని ఓ కప్ లో తీసుకొని అందులో కూడా యాపిల్ ముక్కలు వేసి కొద్దిసేపు వేడి చేయాలి. వీటిని మళ్లీ మిక్సీలో వేసి జ్యూస్‌లా అయ్యేవరకూ గ్రైండ్ చెయ్యాలి. ఇలా చేస్తే యాపిల్-అల్లం టీ తయారు అవుతుంది. ఉదయాన్నే దీనిని తీసుకుంటే శరీర బరువు తగ్గడమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.

































