Sanghavi: సంఘవి సౌత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె 1993లో కొక్కొరొకో మూవీతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించి స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె హీరోయిన్గా సుమారు 80 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్న తరుణంలోనే ఈమె డైరెక్టర్ సురేష్ వర్మతో ప్రేమలో పడ్డారు.

ఇలా వీరి ప్రేమ వ్యవహారం తమ కుటుంబ సభ్యులకు నచ్చకపోయినా సంఘవి తన కుటుంబ సభ్యులను కాదనుకొని 2000 వ సంవత్సరంలో సురేష్ వర్మను వివాహం చేసుకున్నారు. ఇలా కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయింది. అయితే వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన ఈమెకు తన వ్యక్తిగత విషయాలు తన పై చాలా ప్రభావం చూపడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్..
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంఘవి 2016 వ సంవత్సరంలో ఐటీ ఉద్యోగి అయినటువంటి వెంకటేష్ అనే వ్యక్తిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా రెండో పెళ్లి చేసుకున్న ఈమె ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా తన భర్త, కుమార్తెతో కలిసి ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈమె 2019 వ సంవత్సరంలో కొలంజి అనే తమిళ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటున్నారు.



























