ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా
ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో దంత సమస్యలు కూడా ప్రధానమైనవి గానే చెప్పుకోవచ్చు.సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారం కొంత పళ్ళ సందుల్లో ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి జరిగి పంటి సమస్యలు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.దంత సమస్యల నుంచి విముక్తి పొందాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ ఉదయం,రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే పంటి సమస్యలు మీదరిచేరవు.

పంటినొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు కొన్ని చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. జామకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉన్న విషయం తెలిసిందే.అలాగే జామాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉండి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ గుణం పుండ్లను త్వరగా తగ్గిస్తుంది. అలాగే
జామాకు నోటిలోని ప్రమాదకర బ్యాక్టీరియాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.
కొన్ని జామ ఆకులను బాగా మరిగించి వచ్చిన ద్రావణంతో నోటిని పుక్కిలించడం వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా నశిస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరటీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం వల్ల నాచురల్ డిస్ఇంఫెక్టెంట్ అయిన ఉప్పు నీళ్లు పళ్ళ మధ్య ఇరుక్కుని ఉండిపోయిన ఆహార పదార్థాలని బయటకి లాగేసి ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అయ్యి ఇంకేవైనా చిన్న చిన్న నోటి పుండ్లు, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి.లవంగాలు కూడా పంటి నొప్పి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. పంటి నొప్పి మరీ తీవ్రంగా ఉండి జ్వరం, పంటి నుండి చీము కారడం వంటి సమస్యలు ఉంటే వెంటనే దంత వైద్యుని సంప్రదించడం ఉత్తమం.



































