సాధారణంగా మనం ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉండటం గమనిస్తూ ఉంటాము. కొందరు బల్లిని చూడగానే ఆమడ దూరం పారిపోతారు. మరి కొందరు బల్లి అంటేనే ఎంతో అసహ్యించుకుంటారు. కొన్నిసార్లు ఏదైనా పనిలో ఉన్నప్పుడు మన పై బల్లి పడటం సహజంగా గమనిస్తూనే ఉంటాం. ఇలా మీద బల్లి పడితే అప్పుడు కొందరు ఖంగారుగా ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుంటారు. బల్లి మన పై పడటం శుభ సూచికమా? లేక అశుభం కలుగుతుందా? అని ఎన్నో ఆలోచనలు మనలో మెదులుతూ ఉంటాయి. అయితే బల్లి మన శరీరం పైన ఎక్కడ పడితే ఎలాంటి పరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

బల్లి మన తలపై లేదా కుడి చేతి పై పడితే అది మన ఉద్యోగ అభివృద్ధిని సూచిస్తుంది. తలపై ,కుడి చేతి పై బల్లి పడిన వారికి తొందర్లోనే ప్రమోషన్లు వస్తాయి అనడానికి సంకేతం. అదేవిధంగా మోకాలి పై బల్లి పడితే తొందరలోనే ఓ శుభవార్త వింటారు.అంతే కాకుండా ఇంట్లో ఎప్పుడైనా రెండు బల్లులు పోట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తే మన జీవితంలో అమితంగా ప్రేమించే వ్యక్తి మన నుంచి విడిపోతారని అర్థం. అలాగే కొన్ని సార్లు మన ఇంట్లో బల్లి చనిపోయినట్లు కనిపిస్తుంది, అలా కనిపిస్తే మన కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలవుతారని అర్థం.

పగలు బల్లి అరుపు వింటే శుభం కలుగుతుంది. స్త్రీలకు కడుపు పై బల్లి పడితే తొందరలోనే గర్భధారణ జరుగుతుందని సంకేతం. అంతేకాకుండా పాదాలపై, కాళ్ళ వేళ్ళ పై బల్లి పడితే మనకు అదృష్టం కలుగుతుందని సంకేతం. ఏదైనా సమస్యను పరిష్కరించేటప్పుడు బల్లి కనిపిస్తే ఆ సమస్యను అంతటితో వదిలిపెట్టడం ఎంతో ఉత్తమం. ఈ విధంగా బల్లి మన పై పడినప్పుడు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని మన ఇంట్లో బల్లి ఫోటో ఉంటే దానికి నమస్కరించుకోవాలి. లేదాఎవరైనా కంచి కామాక్షి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని తాకి ఉంటే అలాంటి వారి పాదాలకు నమస్కరించడం వల్ల బల్లి దోషం తొలగిపోతుందని మన పెద్దలు చెబుతుంటారు. దీనినే బల్లి శాస్త్రం అని కూడా చెబుతుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here