Sri Reddy: సంచలనాత్మక నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నోరు తెరిస్తే ఎలాంటి మాటలు వస్తాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎదుట ఎవరున్నారనే విషయాన్ని పక్కన పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఈమె నైజం. అలాంటి శ్రీ రెడ్డి నోట వెంట మహేష్ బాబు గురించి ఒక్క సారిగా అలాంటి మాట రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.

తాజాగా మహేష్ బాబుకు మోకాలు సర్జరీ జరగడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మహేష్ బాబు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనని కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. మహేష్ బాబు కరోనా బారిన పడ్డారని విషయం తెలియగానే ఎంతోమంది అతను త్వరగా కోలుకోవాలని స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
అన్నా అంటూ సంబోధించిన శ్రీరెడ్డి..
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి జాగ్రత్తగా ఉండండి అన్నయ్య అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిత్యం నోటి వెంట బూతులు మాట్లాడే శ్రీ రెడ్డి మహేష్ బాబును అన్నయ్య అనడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
Get well soon Super Star Mahesh Babu garu ???????? "Take Care Anna"????????#GetWellSoonSSMB #MaheshBabu
— Sri Reddy (@MsSriReddy) January 6, 2022
































