సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ కి గొడవలు ఉండటం మామూలే. కొందరు ఆ గొడవల వల్ల ఆ హీరో నటించిన సినిమాలో నటించరు. అయితే అలాంటే విబేధాలు విక్టరీ వెంకటేష్‌తో రోజాకి ఉన్నాయి. అయితే వీరి మధ్య 25 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఇద్దరి మధ్య సంబంధాలు కట్ చేసిందనేది సినీ వర్గాల టాక్. రోజా తన భర్త సెల్వమణితో కలిసి వెంకటేష్ హీరోగా, తాను హీరోయిన్ గా ‘చినరాయుడు’ టైటిల్ తో ఓ సినిమా తీద్దామనుకున్నారట.

కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదని సమాచారం. కొన్నాళ్లకు అదే చిత్ర కథాంశంతో వెంకటేష్, విజయశాంతి కలిసి సినిమాను పూర్తి చేశారు. అది విడుదల అయిన తర్వాత రోజా వెంకటేష్ పై శివమెత్తిందట. నాతో తీయాల్సిన సినిమా ఆమెతో తీయడం ఏంటి అంటూ కోపడ్డారట రోజా. దీనిలో తన ప్రమేయం ఎలాంటిది లేదని.. దర్శక, నిర్మాతల వల్లనే తాను ఇలా చేశానని చెప్పాడట వెంకటేష్.
అయితే అప్పటివరకు కాస్త కూల్ అయిన రోజా.. తర్వాత వెంకటేష్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే పోకిరి రాజా సినిమా. ఇందులో ఓ రోజు సినిమా షూటింగ్ ముంబాయిలో జరుగుతుంది. అక్కడ ఆమెను షూటింగ్ కొరకు పిలిచారు. ఆమె ఓ హోటల్ లో ఉంచారు. వెళ్లి మూడు రోజులు అయినా ఇంత వరకు షూటింగ్ ఉందంటూ వాళ్ల నుంచి ఎలాంటి కాల్ రాకపోవడం రోజాకు విసుగు తెప్పించింది. మూడో రోజు సాయంత్రం తన భర్త బర్త్ డే ఉందంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయిందట.
తర్వాత ఎలాగోలా ఆమెను మళ్లీ ముంబాయి రప్పించి.. ఆమెకు సంబంధించిన సీన్లను మొత్తం కంప్లీట్ చేశారట దర్శక, నిర్మాతలు. ఇలా ఆమె ఆ రోజు నుంచి వెంకటేష్ తో సినిమాలు తీయొద్దని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల టాక్. ఆ రోజు నుంచి రోజా, వెంకటేష్ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. ఇలా వెంకటేష్ తో పోకిరిరాజా అనే ఒక్క సినిమా చేశారు రోజా. ఆ తర్వాత వెంకటేష్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం ఇదే.


































